Chandrababu SICKOPSYCO రామ్ గోపాల్ వర్మ సెటైర్ల్, వీడియో ట్వీట్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైనశైలిలో విమర్శలు చేశారు. ఏఐ (కృత్రిమ మేధ) రూపొందించిన వీడియో అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Chandrababu SICKOPSYCO:ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu) జన్మదినం ఈ రోజు.. ఆ పార్టీ నేతలు, మిత్రులు ఆయనను విష్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma) మాత్రం తనదైన శైలిలో శుభాకాంక్షలను తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించిన పేరుతో పాటకు ముందు తన వాయిస్ జోడించాడు. దానిని ట్వీట్ చేశారు.
చంద్రబాబు నాయుడు (Chandrababu) ఓ సైకో అని రామ్ గోపాల్ వర్మ అభివర్ణించారు. కొత్త సైకో సిక్కో అని చెప్పాడు. సిక్కో అంటే.. ‘మెంటల్లీ డిస్టర్బ్ అబౌట్ టు మేనియా సఫరింగ్ ఫ్రమ్ కంపల్సరీ లైయింగ్ డిజార్డర్ మిస్యూజ్ జల్యూజన్స్ అండ్ మల్టీఫ్లై అల్యూసినేషన్స్’ అని చెప్పాడు. తాను ఒక వైపు వేలు చూపిస్తే.. అవతల నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయనే విషయం 40 ఇయర్స్ ఇండస్ట్రీకి (40 years industry) తెలియకపోవడం అదృష్టపరంగా దురదృష్టం అని తనదైన శైలిలో చెప్పారు. ఆ తర్వాత పాట ప్లే అవుతుంది. అందులో చంద్రబాబుని (Chandrababu) విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ పాట, మ్యూజిక్, లిరిక్స్‌ను ఏఐ రూపొందించిదని పోస్టర్ కింద రాశారు. ముందు ఇంట్రోకు మాత్రం వర్మ వాయిస్ వినిపించింది.
‘అదిగదిగో అంటూ ఆ పాట మొదలవుతోంది. సొంత మామను వెన్ను పోటు.. సైకో సిక్కో.. సిక్కో సైకో అని వస్తోంది. చాలెంజ్ చేసి ఎన్నికల్లో ఓడిపోయాడు. ఔరంగజేబు లాంటి చంద్రబాబు.. మామను పొట్టన పెట్టుకొని.. ఆ తర్వాత మామ ఫోటో పెట్టుకొని ఎన్నికల్లో దిగాడు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని అధికారం చేపట్టాడు. మామను వెన్నుపోటు పొడిచిన వయసులో చంద్రబాబుకు కష్టం వచ్చింది. ఎదిగిన కొడుకు ఉన్న ఏం లాభం.. అతను పప్పు’ అని పాట సాగుతోంది. పాట మొత్తం చంద్రబాబుపై సెటైర్స్ ఉన్నాయి. అతని పొలిటికల్ లైఫ్‌ను విమర్శిస్తూ ఉంటుంది.
చంద్రబాబును (Chandrababu) రామ్ గోపాల్ వర్మ (varma) కార్నర్ చేస్తూనే ఉంటారు. ప్రతీ సందర్భంలో.. తన మూవీ విడుదల సమయంలో కూడా టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) బర్త్ డే రాగా.. ఏఐ పేరు చెప్పి వీడియోను వదిలాడు. అందులో తన వాయిస్ జోడించి కసి తీర బాబును తిట్టిపడేశారు. ఆ వీడియోను (video) మీరు కూడా చూడండి.