Bunny : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెకకిన 'పుష్ప: ది రైజ్' సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా 400 కోట్లు రాబట్టింది. దాంతో పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్. ఇటీవలె ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెకకిన ‘పుష్ప: ది రైజ్’ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా 400 కోట్లు రాబట్టింది. దాంతో పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్. ఇటీవలె ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఇప్పటివరకూ పుష్ప2కి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు మేకర్స్. దీని పై బన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసినా.. సుకుమార్ తన పని తాను చేస్తున్నాడు. అయితే బన్నీ బర్త్ డే గిఫ్ట్ మాత్రం అదిరిపోయేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుకలు.. గ్రాండ్‌గా జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో.. పుష్ప ది రూల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు.. టీజర్ కూడా కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. జస్ట్ టీజర్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడట. దాంతో టీజర్ కోసం వెయిటింగ్ అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా.. సూపర్ హిట్ మూవీ ‘దేశముదురు’ సినిమాని రీ రిలీజ్ చెయబోతున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా.. అప్పట్లో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాతోనే హన్సిక హీరోయిన్గా పరిచయమైంది. ఇందులో బన్నీ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. అందుకే మరోసారి దేశముదురును థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మొత్తంగా బన్నీ బర్త్ డేను అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు.. ఇటు అభిమానులు, అటు మూవీ మేకర్స్.