»Bigg Boss Telugu 7 Sofa King Shivaji Nagarjuna Corner To Contestants
BiggBoss7Telugu: సోఫా కింగ్, ఎందుకు వెళ్లారని నాగ్ కౌంటర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు సగం దశకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రతి రోజు ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అయితే శనివారం నాగ్ కంటెస్టెంట్లను మరోసారి ఆడుకున్నాడు. దీంతోపాటు ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారనే విషయం కూడా చెప్పేశారు.
Bigg Boss Telugu 7 sofa king shivaji nagarjuna corner to contestants
బిగ్ బాస్ రోజురోజుకు రసవత్తరంగా కొనసాగుతుంది. తాజాగా శనివారం హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. శోభాకు భోలే విషయంలో ఆమె చేసిన తప్పులను ప్రస్తావించారు. ఆ క్రమంలో వారి తప్పులను ఎత్తిచూపుతూ వారి ఫోటోలు ఉన్న జెండాలను విరగొట్టారు. శోభాకు క్షమించే గుణం లేనప్పుడు మాటలు మాట్లడకూడదని పేర్కొన్నాడు. బిగ్ బాస్ ప్రాపర్టీ విషయంలో మరోసారి రూల్స్ ను గుర్తు చేశారు. తన బియేవియర్ చూసిన వారు తనను పిచ్చోడని అంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కెప్టెన్ గా ఎంపికైన గౌతమ్ కు నాగ్ విషెస్ తెలియజేశారు.
ఆ తర్వాత శివాజీ కామెంట్లను నాగ్ గుర్తుచేశారు. ఎవరినీ కొట్టి వెళ్లిపోతావు శివాజీ అంటూ ప్రశ్నించారు. అందుకు శివాజీ నేను వేరే వాళ్లను కొట్టలేను. నాకు నేనే కొట్టుకుని వెళ్లిపోతానని చెబుతాడు. ఆ తర్వాత తాను నీతిగానే ఉంటున్నానని చెబుతాడు. హోస్లో ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉందని పేర్కొన్నాడు. ఆ నేపథ్యంలో నాగ్ సేఫ్ గేమ్ ఆడొద్దని చెబుతాడు. నెగిటివ్ టాక్ చేయోద్దని కోరుతాడు. దీంతోపాటు బయట కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటామని నాగ్ గుర్తు చేస్తాడు. బయట ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండమని కోరుతాడు. ఏదైనా ఉంటే తనకు చెప్పాలని కోరతాడు. ఆ క్రమంలోనే నాగ్ శివాజీని సోఫా కింగ్ అని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలోనే ప్రియాంక, గౌతమ్ ఈ వారం సేవ్ అయ్యారని నాగ్ చెప్పారు.
అంతకుముందు యావర్ ను తన గేమ్ గురించి ప్రశ్నించారు. కానీ శోభ విషయంలో గొడవ గురించి ప్రస్తావించారు. బిగ్ బాస్ ప్రాపర్టీ అయిన మిర్చి దండను విసిరేశారు. అలా చేయేచ్చా అంటూ నిలదీశారు. ఆ క్రమంలో నీ ప్రవర్తన చూస్తే ఎవరైనా పిచ్చొడనే అనుకుంటారని పేర్కొన్నాడు. ఇక హిట్లర్ అనే పదం గురించి శోభను అడిగారు. ఆ తర్వాత వారిద్దరూ వాగ్వాదం చేసుకున్న వీడియోను ప్లే చేశారు. అందులో ఆమెను నాగ్ హిట్లర్ అనలేదని తేలింది. ఇక నెక్ట్స్ అమర్ దీప్, రతిక గేమ్ గురించి కూడా ప్రస్తావించారు. రతికను హౌస్లో కబుర్లు చెప్పడానికి మళ్లీ హౌస్లో లోకి వెళ్లావా అని నాగ్ గట్టిగానే ప్రశ్నించాడు.