»Anupama Parameswaran Want Yours Anupama But Thats Enough
Anupama Parameswaran: అనుపమా మీ సొంతం కావాలా? అయితే అలా చేస్తే చాలు!
క్యూట్ అండ్ హోమ్లీ బ్యూటీ కాస్త ఇప్పుడు హాట్ బ్యూటీగా మారిపోయింది అనుపమా పరమేశ్వరన్. ఈ అమ్మడు రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లకు గుండెల్లో మంట పుట్టిస్తోంది. ఇక ఇప్పుడు ఓపెన్ ఆఫర్ ఇస్తూ.. అలా చేస్తే నేను మీ సొంతం అని ఊరించింది.
Anupama Parameswaran: మలయాళి బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎక్కడ కూడా ఎక్స్‌పోజింగ్‌కు ఛాన్స్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూ వస్తోంది ఈ క్యూట్ బ్యూటీ. అందుకే కుర్రాళ్లకు అనుపమా డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. అయితే.. ఇప్పుడు చూస్తున్న అనుపమాకు ఒకప్పటి అనుపమాకు చాలా తేడా ఉంది. రౌడీ బాయ్స్ సినిమా నుంచి అను చాలా మారిపోయింది. ఇక టిల్లు గాడితో కలిసిన తర్వాత మరింతగా రెచ్చిపోతానంటోంది. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక కొత్త అనుపమాను చూస్తారని చెబుతోంది అమ్మడు.
టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమను చూస్తే.. కుర్రాళ్లు తట్టుకోలేరనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్‌తో హీటెక్కించడం పక్కా అంటున్నారు. ఇప్ప్పటికే రిలీజ్ చేసిన టిల్లు స్క్వేర్ పోస్టర్స్ అండ్ టీజర్, ట్రైలర్లో పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి కిర్రెక్కించింది అమ్మడు. అయినా కూడా అను అంటే.. ఎందరో కుర్రాళ్ల కలల రాణి అనే చెప్పాలి. అలాంటి అనుపమను దక్కించుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ అలా జరిగే ఛాన్సే లేదు. కానీ అనుపమా మాత్రం కుర్రాళ్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తను కోరికను ఎవరైతే తీరుస్తా వాళ్ల సొంతం అవుతానని ఓపెన్‌గా చెప్పేసింది. కానీ.. అది ఎప్పటికీ తీరని కోరిక కావడం విశేషం.
అమ్మడికి బేబీ హిప్పో కావాలట. దాన్ని ఎవరైతే తనకు ఇస్తారో వాళ్లకు దగ్గర అవుతుందట. తెలుగులో నీటి గుర్రాలు, నీటి ఏనుగుగా పిలిచే హిప్పోపొటామస్ చాలా పెద్ద జంతువు. దాన్ని అనిమల్స్ చానల్స్‌లో మాత్రమే ఎక్కువగా చూడగలం. అలాంటి దాన్ని అనుపమకు గిఫ్ట్‌గా తీసుకురావాలంటే.. ఎప్పటికీ కుదరదు. ఒకవేళ అలాంటి సాహసం చేస్తే.. ఎన్నో లెక్కలు ఉంటాయి. మన దేశంలో అడవి ప్రాణులకు ఏమైనా హాని తలపెడితే.. కటకటాల పాలవుతారు. కాబట్టి.. అనుపమా తీరని కోరికే ఆఫర్‌గా ఇచ్చిందన్న మాట.