అల్లు అర్జున్ బ్యాంక్ అకౌంట్.. అందులో అమౌంట్ ఎంత.. అనేది ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదు. కానీ బన్నీ ఖాతాలో అన్ని కోట్లు వచ్చి పడ్డాయి అనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఖాతాలో అంటే బ్యాంక్ అకౌంట్లోకి అనుకునేరు అసలు మ్యాటర్ వేరే ఉంది. ప్రస్తుతం సినిమాతో పాటు కమర్షియల్‌గా బన్నీ సంపాదన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పుష్ప మూవీ రిలీజ్ అయి పది నెలలు కావొస్తుంది. ఇప్పటి వరకు పుష్ప2 సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ లోపు కమర్షియల్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు అల్లు అర్జున్. దాంతో ప్రముఖ కంపెనీలు బన్నీతో తమ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయించుకోవడానికి క్యూ కడుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో యాడ్స్ చేసిన బన్నీ.. బడా బడా బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఒక్కో యాడ్‌కు బన్నీకి కోట్లలోనే సమర్పిస్తున్నాయి సదరు కంపెనీలు. దాంతో బన్నీ ఖాతాలోకి కోట్లకు కోట్లు వచ్చి పడుతున్నాయట. ఒక్కో యాడ్‌కు 7 నుంచి 9 కోట్లు తీసుకుంటున్న బన్నీ.. ఇటీవల కాలంలో 50 కోట్లకు పైగా కమర్షియల్ ఇన్కమ్ అందుకున్నట్టు టాక్. ఇక సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న పుష్ప2 కోసం దాదాపు 100 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నాడని చాలా రోజులుగా వినిపస్తోంది. దాంతో మొత్తంగా ప్రజెంట్ బన్నీ ఇన్కమ్ 140 నుంచి 150 కోట్ల వరకు ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.