Allu Arjun: బన్నీ అల్లు అర్జున్‌ని (Allu Arjun) ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వరించింది. పుష్ప.. ద రైజ్‌లో పుష్పరాజ్ పాత్రకు గానూ అవార్డు దక్కింది. తెలుగులో తొలి జాతీయ అవార్డు అందుకున్న హీరో బన్నీయే (Allu Arjun) కావడం విశేషం. పుష్ప.. ద రూల్ మూవీ షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ర మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. బన్నీకి (Allu Arjun) జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించారు. పుష్ప, ఆర్ఆర్ఆర్ మూవీలు జాతీయ అవార్డుల్లో దుమ్మురేపాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు 6 అవార్డులు దక్కగా.. పుష్క సినిమాకు రెండు వచ్చాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెనకు అవార్డు వచ్చింది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
జాతీయ ఉత్తమ నటి అవార్డులు ఇద్దరినీ వరించాయి. గంగూభాయి కాఠియావాడిలో నటనకు గానూ అలియా భట్.. మిమిలో యాక్టింగ్‌కు గానూ కృతిసనన్ ఇద్దరికీ అవార్డ్స్‌ను జ్యూరీ ప్రకటించింది. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్మ్స్, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు వరించాయి. వివిధ విభాగాల్లో 281 ఫీచర్ ఫిల్మ్‌లు జాతీయ అవార్డుల కోసం వచ్చాయని జ్యూరీ కమిటీ పేర్కొంది. ఉత్తమ సినిమా విమర్శకుడి క్యాటగిరీలో తెలుగు విభాగంలో పురుషోత్తమచార్యులుకు అవార్డు వరించింది.
In this game, there are no 'number 1' or 'number 2' there is only one player, and that is @alluarjun 𓃵 👑
ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్ ఉద్దమ్, ఉత్తమ గుజరాతీ చిత్రంగా ఛల్లో, ఉత్తమ కన్నడ చిత్రంగా 777 చార్లీ, ఉత్తమ మళయాళీ చిత్రంగా హోమ్‌ను ఎంపిక చేశారు. ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ ఆర్ఆర్ఆర్, ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఆర్ఆర్ఆర్.. ప్రేమ్ రక్షిత్, ఉత్తమ్ స్పెషల్ ఎఫెక్ట్ ఆర్ఆర్ఆర్ శ్రీనివాస మోహన్‌కు అవార్డు దక్కింది.