»Akkineni Brothers Loss Of 50 Crores Rajamouli Into The Field
Akkineni Brothers: అక్కినేని బ్రదర్స్ రూ.50 కోట్ల నష్టం.. రంగంలోకి రాజమౌళి!?
ఎందుకో అక్కినేని మూడో తరం హీరోలు ప్రస్తుతం బ్యాడ్ టైం ఫేజ్ చేస్తున్నారు. కొడుకులే కాదు తండ్రి కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ బాక్సాఫీస్ రేసులో వెనకబడిపోయారు. ఈ మధ్య కాలంలో అక్కినేని హీరోలు ఇచ్చిన నష్టం ఇంకెవరు ఇవ్వలేదని అంటున్నారు. దీంతో నాగార్జున మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.
ఈ సమ్మర్లో అఖిల్ చేసిన భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్ భారీ ఎత్తున రిలీజ్ అయింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా కోసం.. నిర్మాత అనిల్ సుంకర 80 కోట్లు బడ్జెట్ ఖర్చు చేశాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా బోల్తా కొట్టేసింది. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఏజెంట్.. కేవలం ఆరు కోట్లు మాత్రమే షేర్ వసూలు చేసింది. దీంతో ఈ సినిమా 30 కోట్ల వరకు లాస్ చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక అఖిల్ పరిస్థితి ఇలా ఉంటే.. కనీసం నాగ చైతన్య అయినా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతాడని అనుకున్నారు. కానీ కస్టడీ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా దాదాపుగా ఇరవై కోట్ల నష్టాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా ఇద్దరు కలిసి సమ్మర్లో బయ్యర్స్‌కు 50 కోట్ల నష్టం తెచ్చారని అంటున్నారు. వీళ్ల పరిస్థితి ఇలాగే ఉంటే.. అక్కినేని బ్రాండ్ అండ్ మార్కెట్ మరింత దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే కింగ్ నాగ్, కొడుకుల కెరీర్లను నిలబెట్టేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అందుకోసం దర్శక ధీరుడు రాజమౌళినే బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే రాజమౌళిని కలిసి.. అఖిల్‌తో ఓ సినిమా చేయాలని కోరాడట నాగార్జున. అంతేకాదు రాజమౌళికి పది కోట్ల రూపాయలు అడ్వాన్స్ సైతం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఏజెంట్ తర్వాత అఖిల్ యూవీ క్రిఏషన్స్లో అనిల్ అనే కొత్త డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడు. మరి చూడాలి.. ఇప్పటికైనా అఖిల్, నాగ చైతన్య ట్రాక్‌లో పడతారేమో!