బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తళుక్కుమంది. నటి ఊర్వశి రౌతేలా సైతం అక్కడ సందడి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
Cannes 2024: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఫ్రాన్స్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. ఈ ఫెస్టివల్లో ఏటా కచ్చితంగా బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan) పాల్గొని సందడి చేసింది. రెడ్ కార్పెట్‌పై నడవడానికి వెళ్లే ముందు నల్లని పికాక్ స్టయిల్ డిజైనర్ డ్రస్‌లో ఐశ్వర్య అందంగా నడుస్తుంటే కూతురు ఆరాధ్య ఆమె చేయి పట్టుకుని నడిచింది. ఏటా ఈ ఫెస్టివల్లో ఐశ్వర్య ఎలాంటి డ్రస్ వేసుకుంటుందా? అని అభిమానులంతా ఎదురు చూస్తుంటారు. ఐశ్వర్య కూడా అంతే సెలక్టివ్‌గా ఈ డ్రస్‌ని యునీక్‌గా ఉండేలా చూసుకుంటుంది. ఇప్పుడు వేసుకున్న బ్లాడ్ అండ్ వైట్ పికాక్ డ్రస్ కూడా అంతా ఆధునికంగా ఉంది. ముందంతా 3డీ గోల్డ్ డిజైన్‌తో హైలెట్ అయి ఉంది.
ఐశ్వర్యరాయ్ కేన్స్‌కి బయలుదేరుతున్న సమయంలో ముంబయి ఎయిర్పోర్ట్ దగ్గర చేతికి కట్టుకుని, దానికి బ్యాగ్ వేసుకుని కనిపించింది. దీంతో ఆమె ఇలా ఎలా రెడ్ కార్పెట్‌పై క్యాట్ వాక్ చేస్తుందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఐశ్వర్య ఇప్పుడు మాత్రం ఈ నల్లటి పీకాక్ డ్రస్‌లో చేతిని మామూలుగా పెట్టుకుని నడుస్తూ కనిపించింది. అయితే ఇప్పుడు కూడా చేతికి తెల్లటి బ్యాండ్ లాంటిది ఉంది.
మరో వైపు ఈ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) సైతం సందడి చేసింది. ఎర్రటి డిజైనర్ డ్రస్‌లో చందమామలా మెరిసిపోయింది. ఈ డ్రస్ వేసుకుని కేన్స్ రెడ్ కార్పెట్(Red Carpet) పై క్యాట్‌వాక్ చేసి అందరినీ ఆకట్టుకుంది.