‘అఖండ 2’ విజయోత్సవ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, బోయపాటి చిత్రాల్లో ‘నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్’ ఉంటుందని ఆయన అన్నారు. లాజిక్ చూస్తే మ్యాజిక్ పనిచేయదని ఆయన తెలిపారు. ‘అఖండ 2’ సినిమాకు లాజిక్‌లు అక్కర్లేదని, అది దైవత్వమని చెప్పారు. ఈ సినిమా తరువాత జనరేషన్‌కు ఒక ‘భగవద్గీత, బైబిల్, ఖురాన్’లాంటిదని వ్యాఖ్యానించారు.