మెగాస్టార్ చిరంజీవి కెరీర్ను మార్చిన సినిమా ‘ప్రాణం ఖరీదు’. ఈ మూవీ విడుదలై ఇవాళ్టికి 47 ఏళ్లు పూర్తయింది. చిరంజీవి కెరీర్లో ‘పునాది రాళ్లు’ సినిమాకు మొదటి సంతకం చేసినప్పటికీ.. ‘ప్రాణం ఖరీదు’ మొదట రిలీజై సక్సెస్ అందుకుంది. సెప్టెంబర్ 22, 1978లో విడుదలైంది. ఈ సినిమాకు కే వాసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, చంద్రమోహన్ కీలక పాత్రలో కనిపించారు.