‘దృశ్యం’, ‘దృశ్యం 2’కి బిన్నంగా ‘దృశ్యం 3’ని తెరకెక్కిస్తున్నట్లు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెలిపారు. ‘దృశ్యం 4’ ఉంటుందో.. లేదో ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. అంతేకాదు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇంకా చాలు అనిపంచిందని, తదుపరి సినిమాలు కొత్తగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అవి ఫెయిల్ అయినా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చామనే తృప్తి ఉంటుందన్నారు.