డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో సూపర్ హీరో మూవీ ‘అధీర’ను ప్రకటించారు. PVCUలో భాగంగా వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ దాసరి, SJ సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ‘ప్రపంచాన్ని అంధకారం కమ్మేసినప్పుడు మెరుపు రూపంలో ఆశాకిరణం పుట్టుకొస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు.