జీవితం ఎప్పుడూ ఊహించిన విధంగా ఉండదని దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. ‘ఇక్కడ ఎవరి జీవితం ఎవరి చేతుల్లోనూ లేదు. అన్నీ అనుకున్నట్లు జరగవు. ఎన్ని ప్లాన్స్ ఫెయిల్ అయినా కుంగుబాటుకు గురి కావద్దు. తలుపులు అన్ని మూసుకుపోతే ప్లాన్-కే ఉంది. కే అంటే కిటికీ. వెతికితే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. అది చాలు దూకేయడానికి. ప్లాన్-బి కంటే మీ మానసిక స్థిరత్వం పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకోండి’ అని తెలిపారు.