టాలీవుడ్లో ఇటీవల నెలకొన్న పరిస్థితులపై మంచు విష్ణు ‘మా’ అసోసియేషన్ సభ్యులకు పలు సూచనలు చేశారు. ‘ప్రభుత్వాల మద్దతుతోనే సినీ పరిశ్రమ ఎంతో ఎదిగింది. ప్రతీ ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. సున్నిత అంశాలపై సభ్యులు బహిరంగ ప్రకటనలు చేయవద్దు. వివాదాస్పద అంశాల జోలికి ఎవరూ వెళ్లవద్దు. చట్టం తన పని తాను చేస్తుంది. అందరూ సంయమనం పాటించాలి’ అని విజ్ఞప్తి చేశారు.