నటుడు మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. 1978లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, 1986లో ఏకంగా 34 సినిమాల్లో నటించారు. నిర్మాతగా, గాయకుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాకుండా, 2 జాతీయ పురస్కారాలు, 9 కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడు అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.