సత్యసాయి: ‘సాయీ.. సర్వమూ నీవేనోయీ’ అంటూ ఏలూరు జిల్లా సత్యసాయి భక్తులు సంగీత కచేరీ నిర్వహించారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి వచ్చిన వారు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సంగీత కచేరీతో అలరించారు. సత్యసాయిని కీర్తిస్తూ వారు చేసిన కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది.