సినీరంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఈనెల 27 నుంచి 29 వరకు జరగనుంది. ఇప్పటికే సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. ఇక ప్రతి ఏడాది తన డ్యాన్స్‌తో ఆకట్టుకునే సీనియర్ నటి రేఖ నృత్య ప్రదర్శన ఈ సారి కూడా ప్రత్యేకం కానుంది. 150 మంది డ్యాన్సర్లతో 22 నిమిషాల పాటు రేఖ డ్యాన్స్ చేయనున్నారు. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, కరణ్ జోహర్, విక్కీ కౌశల్ యాంకర్లుగా సందడి చేయనున్నారు.