నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శైలేష్ కొలను కాంబోలో ‘హిట్-3’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీలో ఆమె పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. మృదుల అనే పాత్రలో ఆమె కనిపించనున్నట్లు తెలిపారు. ఇక అర్జున్ సర్కార్ పాత్రలో నాని నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 1న విడుదలవుతుంది.