ఓ చిన్నారిని కాపాడి హీరో సోనూసూద్ మంచి మనసు చాటుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా చెన్నూరుకు చెందిన కృష్ణ, బిందుప్రియల 3ఏళ్ల కూతురు చిన్నప్పటి నుంచి గుండె సమస్యతో బాధపడుతోంది. ఆపరేషన్‌కు రూ.6 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన స్పందించి.. ముంబైలో ఆ పాపకి ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది.