తన వ్యాఖ్యలకు హీరో కార్తీ క్షమాపణలు చెప్పడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించిన సంగతి తెలిసిందే. దీంతో కార్తీ బ్రదర్ హీరో సూర్య పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మీ అభినందలకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ అంటూ రిప్లై ఇచ్చారు. కాగా ‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్ అడిగిన ప్రశ్నకు లడ్డూ ఇప్పుడు సెన్సిటివ్ విషయమని కార్తీ సమాధానం ఇవ్వగా.. లడ్డూ అనేది సెన్సిటివ్ విషయం కాదంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.