నేడు ప్రముఖ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి. ఆయన 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 1966లో వచ్చిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న మూవీతో సింగర్‌గా SPB ప్రస్థానం మొదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వంటి భాషల్లో దాదాపు 40వేలకు పైగా పాటలు పాడారు. ETVలో ‘పాడుతా తీయగా’ అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రవేశం చేశారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులు వరించాయి. సెప్టెంబర్ 25, 2020లో బాలు మరణించారు.