ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. నేటి నుంచి 29వ తేదీ వరకు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా లేడీ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం ఆరోపణలు నేపథ్యంలో ఆయన నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టనున్నారు.