పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. తాజాగా ఈ సినిమాపై లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీలో పవన్ పాడిన పాటపై రేపటి నుంచి షూటింగ్ జరగనుందట. అక్టోబర్ 31న ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2025 మార్చి 28న విడుదల కానుంది.