»No Evidence That Prabhakaran Is Alive Sri Lanka Army
No Evidence Prabhakaran Is Alive:ప్రభాకరన్ చనిపోయాడు, డీఎన్ఏ సర్టిఫికెట్ ఇదిగో: శ్రీలంక ఆర్మీ
No Evidence Prabhakaran Is Alive: లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈళం (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ (Velupillai Prabhakaran) బతికే ఉన్నారని తమిళ నేషనలిస్ట్ మూమెంట్ (TNM) నేత పి.నెడుమారన్ (P.Nedurmaran) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను శ్రీలంక ఆర్మీ కొట్టిపారేసింది. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని శ్రీలంక సైన్యం స్పష్టం చేసింది.
No Evidence Prabhakaran Is Alive: లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈళం (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ (Velupillai Prabhakaran) బతికే ఉన్నారని తమిళ నేషనలిస్ట్ మూమెంట్ (TNM) నేత పి.నెడుమారన్ (P.Nedurmaran) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను శ్రీలంక ఆర్మీ కొట్టిపారేసింది. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని శ్రీలంక సైన్యం స్పష్టం చేసింది. ప్రభాకరన్ మరణించినట్టు ధ్రువీకరించే డీఎన్ఏ సర్టిఫికెట్స్‌తో సహా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని శ్రీలంక డైరెక్టర్ మీడియా అండ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరత్ (Ravi Herath) తెలిపారు.
‘వేలుపిళ్లై ప్రభాకరన్ (prabhakaran) బతికి ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు రికార్డుల్లో లేవు. బతికున్నట్టు చెప్పిన వ్యక్తే ఈ విషయం చెప్పాలి. ఏ ఆధారంతో ప్రభాకరన్ (prabhakaran) బతికున్నట్టు ప్రకటించారనేది ఆయననే అడగండి” అని బ్రిగేడియర్ రవి (ravi) అన్నారు. 2009లో శ్రీలంక సైన్యం ప్రభాకరన్‌ను మట్టుబెట్టిందని చెప్పారు. ఆ రోజుతో యుద్ధం ముగిసిందని చెప్పారు. ప్రభాకరన్ బతికున్నట్టు వస్తున్న వార్తలపై శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి అలి సబ్రి ఆచితూచి స్పందించారు.
వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని, మంచి ఆరోగ్యంతో కూడా ఉన్నారని పి.నెడుమారన్ ఈరోజు చెన్నైలో సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రభాకరన్ ఎక్కడ ఉన్నాడనే విషయానే అంశం వెల్లడించలేదు. త్వరలో ప్రభాకరన్ జనం ముందుకు వస్తారని చెప్పారు. అతని కుటుంబం (family) కూడా సురక్షితంగా ఉందని, తాను వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. ప్రభాకరన్ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్న తర్వాతే ఈ విషయాలను బయట పెడుతున్నట్టు చెప్పారు. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ (tamil people) ప్రజలందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ప్రభాకరన్ గురించి వ్యాప్తి చేసిన ఊహాగానాలకు దీంతో తెరపడుతుందని ఆశిస్తున్నానని నెడుమారన్ (nedumaran) అన్నారు. ప్రభాకరన్ సరైన సమయంలో జనం ముందుకు వస్తారని పేర్కొన్నారు. తమిళ ఈళం గురించి సమగ్ర ప్రణాళికను త్వరలో ఆయన ప్రకటిస్తారని వెల్లడించారు. నెడుమారన్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. శ్రీలంక సైన్యం మాత్రం కొట్టిపారేసింది.