»Indian Phd Student 33 Killed In Bicycle Accident In London
London : లండన్ రోడ్డు ప్రమాదంలో భారత పీహెచ్డీ విద్యార్థిని మృతి
లండన్‌లో సైకిల్‌పై ఇంటికి వెళుతున్న భారతీయ పీహెచ్డీ విద్యార్థినిని ట్రక్ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Bicycle Accident In London : లండన్‌లో భారతీయ పీహెచ్డీ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె పేరు చేష్ఠా కొచ్చర్(33). ఈ విషయాన్ని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గతంలో ఆమె నీతి ఆయోగ్‌కు సంబంధించిన ఓ ప్రాజెక్టులో పని చేసినట్లు ఆయన చెప్పకొచ్చారు. ప్రస్తుతం బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్డీ చేయడానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చేష్ఠా వెళ్లారు. సైక్లింగ్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో( Accident) మరణించారు.
చేష్ఠా మార్చి 19వ తేదీన ఎల్ఎస్ఈ నుంచి సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఆ సమయంలో ఆమె భర్త ఆమెకు కొద్ది దూరంలోనే ఉన్నారు. వెంటనే ఆయన వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె మృతి చెందారు. ఆమె తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ లండన్ బయలుదేరి వెళ్లారు. మృత దేహాన్ని స్వస్థలానికి తీసుకురానున్నారు.
చేష్ఠా వాళ్ల కుటుంబం గురుగ్రామ్‌లో నివాసం ఉంటుంది. గత సెప్టెంబర్‌లో పీహెచ్డీ(PHD) చేయడానికి ఆమె లండన్(London) వెళ్లారు. గతంలో ఆమె దిల్లీ విశ్వవిద్యాలయం, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా షకాగో విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు. ఈ విషయమై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ విచారం వ్యక్తం చేశారు. ఆమె చాలా తెలివన వ్యక్తి, ధైర్యవంతురాలని అన్నారు. చాలా త్వరగా తమని విడిచి వెళ్లిపోయిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.