Donald Trump: భారతదేశంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విషం కక్కాడు. తాను తిరిగి అధ్యక్ష పదవీ చేపడితే.. భారత్‌పై పన్నులు ఉంటాయని హెచ్చరించారు. అమెరికాకు చెందిన ఉత్పత్తులపై భారత్ అధికంగా ట్యాక్స్ వేస్తుందని ఆరోపించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రతీకార పన్నులు ఉంటాయని హెచ్చరించారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌ను టారిఫ్ కింగ్ అని పేర్కొన్నారు. భారతదేశానికి జీఎస్పీని రద్దుచేశారు. దీంతో భారత్ మార్కెట్లోకి సమాన, హేతుబద్ధ సంధానత లభించలేదని ఆరోపించారు.
హార్లే డేవిడ్ సన్ లాంటి అమెరికా ఉత్పత్తులపై భారతదేశం పెద్ద మొత్తంలో టారిఫ్ విధించింది. అక్కడ 100, 150, 200 శాతం పన్నులు ఉన్నాయి. ఇలా అయితే అక్కడ తమ కంపెనీలు ఎలా వ్యాపారం చేయగలవు.. అక్కడికి వెళ్లి ప్లాంట్ నిర్మిస్తే.. టారిఫ్ ఉండవు.. అలా చేయాలని భారత్ కోరుకుంటుందని ట్రంప్ అన్నారు. అమెరికాకు చెందిన వస్తువులకు భారత దేశం 200 శాతం పన్ను వసూల్ చేస్తే.. వారి ఉత్పత్తులకు సుంకం వేయొద్దా అని అడిగారు. అమెరికా కంపెనీలు పన్ను కడుతున్నాయని.. భారత దేశం కూడా కట్టాల్సిందేనని వివరించారు.
ప్రైమరీ డిబేట్‌కు పాల్గొనబోనని ట్రంప్ (Donald Trump) తెలిపారు. భవిష్యత్‌లో జరిగే డిబేట్లకు కూడా హాజరుకాబోనని వివరించారు. తాను ఎవరో అందరికీ తెలుసు అని.. అందువల్ల చర్చ చేపట్టాల్సిన అవసరం లేదన్నారు.