Boat Capsize: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఫెర్రీ నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఉన్నట్లుండి బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 58 మందికి పైగా నీట మునిగి చనిపోయారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు శనివారం తెలిపారు. సుమారు 300 మందితో కూడిన పడవ శుక్రవారం రాజధాని బాంగూయ్ గుండా మపోకో నదిని దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే స్థానిక బోట్‌మెన్‌లు, మత్స్యకారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
మిలటరీ సెర్చ్ ఆపరేషన్‌ను విస్తృతం చేయడంతో మృతుల సంఖ్య పెరుగుతోందని బంగ్యూ యూనివర్సిటీ హాస్పిటల్ అధికారులు తెలిపారు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగూయ్లోని నది గుండా గ్రామంలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పడవలో 300 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. అయితే వారిలో 58 మంది మరణించారని శనివారం ఓ అధికారి తెలిపారు. “సంఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత మేము అప్రమత్తమయ్యాము. రెస్క్యూ సిబ్బంది సుమారు 58 మృతదేహాలను వెలికి తీయగలిగారు” అని పౌర రక్షణ విభాగం అధిపతి థామస్ జిమాస్సే రాయిటర్స్‌తో అన్నారు. మపోకో నదిలో ఎక్కువ మంది ప్రజలు మునిగిపోయారు. వారికోసం వెతుకులాట కొనసాగుతోంది. నదీ రవాణా భద్రతా నియమాలను మెరుగ్గా పాటించాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బోటులో 300 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.