»If You Kiss Your Girlfriend The Cranberry Bursts China Viral News
Lose hearing: ప్రియురాలిని కిస్ చేస్తే..కర్ణబేరి పగిలింది
మీరు ప్రేమలో ఉన్నారా? అయితే మీ ప్రియురాలని ముద్దు పెట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటివల ఓ యువకుడి తన లవర్ ని కిస్ చేసి ఏకంగా చెవిపోటు(lose hearing) తెచ్చుకున్నాడు. అంతేకాదు అతను కోల్కోవాలంటే ఏకంగా రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
If you kiss your girlfriend the cranberry bursts china viral news
ఓ యువకుడు తన ప్రియురాలికి ముద్దుపెట్టిన(kiss) క్రమంలో విచిత్ర అనుభవం అతనికి ఎదురైంది. ఇక వివరాల్లోకి వెళితే ఆగస్టు 22, 2023న చైనీస్ వాలెంటైన్స్ డే సందర్భంగా చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఓ సుందరమైన వెస్ట్ లేక్ వద్ద ఓ లవర్స్ జంట ముద్దు పెట్టుకున్నారు. అయితే వీరు ఏకంగా నాన్-స్టాప్ గా 10 నిమిషాల పాటు ఉద్వేగభరితంగా ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రియుడు విచిత్రమైన అనుభూతిని పొందాడు. అతని ఎడమ చెవిలో నొప్పులు మొదలయ్యాయి. దీంతోపాటు బబ్లింగ్ శబ్దం కూడా వచ్చింది. ఈ కలవరపెట్టే అనుభవం అతని వినికిడి లోపానికి దారితీసింది. ఆ క్రమంలో అతను వైద్య సహాయం కోరుతూ ఆసుపత్రిని సందర్శించాడు. అక్కడ పరిశీలించిన వైద్యులు చెవిపోటు వచ్చిందని, కర్ణబేరికి చిల్లులు పడినట్లు నిర్ధారించారు. అంతేకాదు అతను రికవరీ కావాలంటే రెండు నెలల వ్యవధి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.
అయితే ఉత్సాహభరితంగా ముద్దులు పెట్టుకునే క్రమంలో చెవిలోని గాలి పీడనంలో వేగవంతమైన మార్పు వస్తుందని వైద్య నిపుణులు చెప్పారు. దీంతోపాటు భాగస్వామి అధిక శ్వాసతో కలిసి ఉన్నప్పుడు అది చెవిపోటులకు(lose hearing) దారి తీసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇది గాయం లేదా ఒత్తిడిలో ఆకస్మిక మార్పులు వంటి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చని వైద్యులు అన్నారు. అయితే తీవ్రమైన ముద్దుల కారణంగా ఆకస్మాత్తుగా వినికిడి లోపం సంభవించడం ఇది మొదటి కేసు కాదని పేర్కొన్నారు. 2008లో కూడా ఇదే తరహాలో ఓ చైనీస్ యువతి తన ప్రియుడిని ముద్దుపెట్టుకుంటూ వినికిడి కోల్పోయింది. గత నెలలో దక్షిణ చైనాలో ఒక జంట ఇంట్లో టీవీ చూస్తూ వినికిడి శక్తి కోల్పోయింది.