Corona Virus: కోవిడ్ వల్ల యావత్ ప్రపంచం తల్లిడిల్లింది. గత కొన్నిరోజుల నుంచి స్తబ్ధుగా ఉంది. ఇప్పుడు మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ప్రారంభం కావడంతో అందరిలో ఆందోళన మొదలయ్యింది. కొత్త వేరియంట్ వల్ల రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త వేరియంట్‌పై తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. జేఎన్1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని తెలిపింది.
Due to its rapidly increasing spread, WHO is classifying the variant JN.1 as a separate variant of interest (VOI) from the parent lineage BA.2.86. It was previously classified as VOI as part of BA.2.86 sublineages.
ఈ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్1తో పాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కరోనా బీఏ.2.86 వేరియంట్ నుంచి జేఎన్.1 వేరియంట్ నుంచి ఉద్భవించిందని తెలిపింది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 341 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎక్కువగా కేరళ రాష్ట్రంలో నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 2311కి పెరిగింది. 24 గంటల్లో మొత్తం మూడు మరణాలు నమోదయ్యాయి. కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా చైనా, సింగపూర్‌తో పాటు పలు దేశాల్లో కూడా ఈ సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.