ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ముందుగా 'బ్రో' మూవీ థియేటర్లోకి రాబోతోంది. తాజాగా ఈ సినిమా రన్ టైం లీక్ అయిపోయింది.
రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఏండ్లకేండ్ల సమయాన్ని కేటాయించడమే కాదు.. ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి సమయంలో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ టైంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు వదల్లేదు జక్కన్న. అలాంటిది మహేష్ బాబును వదులుతాడా.. ఛాన్సే లేదు. అందుకే.. ఓ మూడు నెలల పాటు కఠోర ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు మహేష్.
దివంగత నటి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ. ఆమె బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్నా, చెప్పుకోతగిన హిట్ మాత్రం ఆమెకు దక్కలేదు. దీంతో తన దృష్టి దక్షిణాదిపై పెట్టింది. సౌత్ లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టింది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ ప్రీమియర్‌లు నిన్న రాత్రి ప్రదర్శించారు. ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జరిగిన “బేబీ” సినిమా స్పెషల్ ప్రీమియర్ షోకి స్టార్ హీరో విజయ్ దేవరకొండ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
నిజమే.. స్టార్ బ్యూటీ రష్మిక మందన్నకు నితిన్ లాంటి హీరోలతో సినిమాలు చేసే టైం లేదట. అందుకే ముందుగా ఓకె చెప్పి.. ఆ తర్వాత నితిన్‌కు షాక్ ఇచ్చింది అమ్మడు. కానీ మరో యంగ్ హీరోతో మాత్రం రొమాన్స్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరి నితిన్‌కు నో చెప్పిన అమ్మడు.. ఆ హీరోకి ఓకె చెబుతుందా?
హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల.. దాదాపు ఆరు నెలల నుంచి ఏడాది కాలం పాట్ సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతోంది సమంత. ఇప్పటికే సామ్ కమిట్ అయిన సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిపోయాయి. ఇలాంటి సమయంలో సమంతను ఓ ఆట ఆడుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. పాత ట్వీట్‌ను బయటికి తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు.
అనసూయ అందాల ఆరబోతతో అమెరికా వీధులు హీటెక్కిపోతున్నాయి. అసలు ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా.. అనసూయ ఇంత పర్ఫెక్ట్ ఫిగర్‌ను ఎలా మెయింటేన్ చేస్తోంది? అనేది ఎప్పుడు హాట్ టాపికే. గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతునే ఉంటుంది. తాజాగా ఫారిన్ వీధుల్లో షేర్ చేసిన ఫోటోలకు.. టెంప్ట్ అయిపోయిన కుర్రకారు.. దారుణంగా కామెంట్స్ చే...
లైగర్ బ్యూటీ అనన్య పాండే గతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో ఉంది అంటూ ఎంతో కాలంగా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను వారు ఏ రోజూ కన్ఫామ్ చేయలేదు. అయితే, తాజాగా ఆమె మరో హీరోతో ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. అందుకు సాక్ష్యంగా వారి ఫోటోలు కూడా బయటకు రావడం విశేషం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక.. ఇంకో పెళ్లి చేసుకోకుండా.. ప్రస్తుతం పవన్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్. ఇద్దరు పిల్లలను తన దగ్గరే ఉంచుకొని చూసుకుంటోంది. ఇక రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే.. అప్పుడప్పుడు అకిరా నందన్ గురించి పోస్ట్‌లు పెట్టే రష్మిక.. ఇంకొన్ని సోషల్ యాక్టివిటీస్‌కు సంబందించిన ఫోటోలు కూడా షేర్ చేస్తుం...
బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రాజెక్ట్ కు ఇంకా పేరు ఖరారు చేయలేదు. కానీ RC16 గా పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆగస్టులో ప్రారంభించే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ రెగ్యులర్ షూట్ డిసెంబర్ 2023 నుండి లేదా 2024 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బండ్ల గణేష్ ఆస్పత్రిలో చేరిన వార్త తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బండ్లన్నకు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. ఆస్పత్రి బెడ్‌పై బండ్ల గణేష్ సెలైన్ పెట్టుకుని కనిపించిన ఫోటో వైరల్ అవ్వడమే కాకుండా బండ్లన్న చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సమంత(Samantha) గురించి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. సామ్ అంటేనే సోషల్ మీడియాలో సెన్సేషన్. అలాంటి సమంత.. ఓ ఏడాది పాటు సినిమాలకు దూరమవుతోందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయితే.. సమంత నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడంతో.. ఇందులో నిజం లేదనుకున్నారు. కానీ తాజాగా సామ్ షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.
రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమాపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. RRR సంచలనం తర్వాత రామ్ చరణ్ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ కావడంతో అంచనాలు పెరిగాయి. అయితే గేమ్ ఛేంజర్ మూవీలో హిట్ డైరెక్టర్(Sailesh Kolanu) కనిపించడం పట్ల పలు పుకార్లు వినిపిస్తున్నాయి.
ప్రముఖ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(dhoni) సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే మొదటి ప్రాజెక్టును ప్రకటించాడు. కానీ ఇప్పుడు తెలుగులోనూ పలు హీరోలతో మూవీ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలిసింది.
శివకార్తికేయన్ తన రాబోయే సూపర్ హీరో చిత్రం 'మావీరన్' విడుదలకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ మూవీలో విజయ్ సేతుపతి, రవితేజ కూడా 'మావీరన్' స్టార్ కాస్ట్‌లో చేరారు. కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమా తమిళ, తెలుగు వెర్షన్లలో వరుసగా విజయ్ సేతుపతి, రవితేజ కథానాయకులుగా వ్యవహరిస్తారని శివకార్తికేయన్(shiva karthikeyan) అధికారికంగా ప్రకటించారు.