Trivikram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరిది టాలీవుడ్లో డెడ్లీ కాంబినేషన్.. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఙాత వాసి వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అయితే మళ్లీ పవన్, త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరిది టాలీవుడ్లో డెడ్లీ కాంబినేషన్.. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఙాత వాసి వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అయితే మళ్లీ పవన్, త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు. కానీ పవన్ చేసే సినిమాలకు బ్యాక్ బోన్‌గా ఉంటున్నాడు త్రివిక్రమ్. పవన్ లాస్ట్ ఫిల్మ్ భీమ్లా నాయక్ సక్సెస్ క్రెడిట్ మొత్తం.. త్రివిక్రమ్ ఖాతాలోనే పడిపోయింది. ఈ సినిమకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. దాంతో డైరెక్టర్ సాగర్ కె.చంద్ర పేరుకే పరిమితమయ్యాడు. ఇప్పటి వరకు మరో ఆఫర్ అందుకోలేదు సాగర్. ఇక ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్.. పవన్ రీమేక్ కోసం తన కలానికి పదను పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా తమిళ్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ గురించి చర్చ జరుగుతునే ఉంది. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ సినిమాకు ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్ర ఖనినే దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ముందుగా ఈ రీమేక్ కోసం సాయి మాధవ్ బుర్రాను మాటల రచయితగా తీసుకున్నారు. అయితే ఇతర కమిట్మెంట్స్ వల్ల.. ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దాంతో మళ్లీ త్రివిక్రమ్‌నే రంగంలోకి దిగినట్టు సమాచారం. మాటలే కాదు స్క్రీన్ ప్లే కూడా అందించబోతున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 28తో బిజీగా ఉన్నాడు. ఇటీవలె షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు వినోదయ సీతంకు డైలాగ్ వర్క్ చేస్తున్నారట మాటల మాంత్రికుడు. మరి ఈ రీమేక్‌తో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.