కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరో సినిమా, లేదా పెద్ద మూవీ అయితే రూ.50 లక్షలు పారితోషకం తీసుకుంటాడట. ఒకవేళ మూవీలోని 6 పాటలు చేస్తే.. రూ.3 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. చిన్న మూవీ అయితే పాటకు రూ.10 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.
వరలక్ష్మి శరత్ కుమార్, శశాంక్, రవిశంకర్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘RTI’. క్రైమ్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా OTTలోకి రాబోతుంది. ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్‌లో ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోషల్ మీడియాలో తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారు వెంటనే సారీ చెప్పాలని నటి సిమ్రాన్ అన్నారు. ‘నాపై తరచూ వార్తలు వస్తున్నా.. నేను సైలెంట్‌గానే ఉన్నాను. నాకు ఆత్మగౌరవం ఉంది. అందుకే ఇప్పుడు వాటికి చెక్ పెడుతున్నా. పెద్ద హీరోలతో కలిసి పనిచేయాలనే ఆలోచన నాకు లేదు. వారితో ఇప్పటికే చాలా మూవీలు చేశాను. ప్రస్తుతం నా లక్ష్యాలు భిన్నంగా ఉన్నాయి. ఇకనైనా నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా న్యూ లుక్‌లో దర్శనమిచ్చాడు. గడ్డం తీసేసి.. క్లీన్ షేవ్‌లో ముఖానికి మాస్క్ పెట్టుకుని ఓ ఎయిర్‌పోర్టులో కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది.
ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ తమిళనాడులోని మధురైలో జరుగుతోంది. దసరా కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ కా...
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో గిరి కృష్ణ కమల్ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సారీ’. ఇందులో శ్రీలక్ష్మి సతీష్ అలియాస్ ఆరాధ్య దేవి ప్రధానపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఐ వాంట్ లవ్ ఫర్ ఎవర్ అంటూ సాగే మొదటి పాట విడుదలైంది. ఇక ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో గిరి కృష్ణ కమల్ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘శారీ’. ఇందులో శ్రీలక్ష్మి సతీష్ అలియాస్ ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఐ వాంట్ లవ్ ఫరెవర్’ అంటూ సాగే మొదటి పాట విడుదలైంది. ఇక ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోందని ఇదివరకే మేకర్స్ తెలిపారు.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్ 2’ రాబోతుంది. ఈ మూవీలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే ప్రభాస్, మిగిలిన ప్రధాన పాత్రలపై భారీ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తారట. ఈ సీన్స్‌లోని యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్‌గా ఉంటాయట. ప్రభాస్ గెటప్ అండ్ స...
తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సత్యం సుందరం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్ అయింది. రేపు సాయంత్రం 6 గంటలకు పార్క్ హయత్ హైదరాబాద్‌లో దీన్ని నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఈన...
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘SK-30’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు ఉదయం 10:14 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘రెడీ అయిపోండి తమ్ముళ్లూ.. రేపు సౌండ్ అదిరిపోద్ది’ అంటూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాను AK ఎంటర్‌టైన్...
నాగ చైతన్య ప్రధాన పాత్రలో కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే, ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో ఓ బలమైన లేడీ పాత్రకి మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర విజయశాంతికి సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించినట్లు సమాచారం.
టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కిస్తున్న సినిమా ‘స్వాగ్’. ఇందులో నటి రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీలోని ఇంగ్లాండ్ రాణి అనే మూడో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో మీరా జాస్మిన్, సునీల్, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 4న విడుదలవుతుంది.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా ‘దేవర’. ఈ సినిమా రెండో ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్‌ను ముందు చెప్పినట్లుగా ఉదయం 11:07 గంటలకు విడుదల చేయట్లేదని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. దీంతో ఇటీవల ‘ఆయుధ పూజ’ పాట విషయంలో కూడా ఇలాగే చేశారంటూ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 2...
నార్త్ అమెరికాలో ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ మొదటి వీక్‌లో 11 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా ‘కల్కి’ రికార్డుకెక్కింది. నార్త్ అమెరికాలో ఎన్టీఆర్ ‘దేవర’ దూకుడు చూస్తుంటే.. మొదటి వారం పూర్తయ్యే లోపు ఇది 11 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర...
టాలీవుడ్ హీరో అడివి శేష్ ఇప్పటికే రెండు సినిమాలను ప్రకటించాడు. ప్రస్తుతం వాటి షూటింగ్ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో అడివి శేష్ 2025లో తన మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లు పోస్ట్ పెట్టాడు. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు విజయం సాధిస్తాయో చూడాలి. కాగా, ఆయన ప్రస్తుతం ‘గూఢచారి 2’ చిత్రంలో నటిస్తుండగా.. ఆయన మరో సినిమా ‘డెకాయిట్’ కూడా రాబోతుంది.