దేవర రిలీజ్ ట్రైలర్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటికే 30 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న దేవర మూవీ.. ఈ నెల 27వ తేదీన రిలీజ్ అవుతోంది.
TG: వరద బాధితులకు సహాయార్థం సీఎం సహాయనిధికి హీరో మహేష్ బాబు విరాళం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.60 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మహేష్ దంపతులు చెక్కు అందజేశారు. సొంత డబ్బులు రూ.50 లక్షలు, AMB తరపున మరో రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘పుష్ప- 2’. పుష్పకు సీక్వెల్‌గా పుష్ప 2 రాబోతుంది. డిసెంబర్ 6న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ “కౌంట్ డౌన్” పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫ్యాన్స్ కోరిక మేరకు కేవలం 75 రోజుల్లోనే పుష్పరాజ్ రూలింగ్ చూడబోతున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
బిగ్ బాస్8 హౌస్‌లో 3వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అభయ్ నిన్న ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లోకి వెళ్లిన మూడు వారాల తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. ప్రారంభంలో అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ భావించినా.. గేమ్స్, టాస్క్‌లలో ఎఫెక్టివ్‌గా ఆడలేకపోయారు. దీంతో అతనికి తక్కువ ఓటింగ్ వచ్చింది. కాగా, మూడు వారాలకు ఆరు లక్షల రూపాయలను అభయ్ రెమ్యూనరేషన్‌గా తీసుకున్నట్లు సమాచారం.
సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ‘ధమాకా’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించనున్న లేటెస్ట్ సినిమాకు ‘మజాకా’ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో సంప్రదాయ ధోతీ లుక్‌లో కనిపించాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి వ...
క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రం మొదటి భాగాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయనున్నారు. ఈ మేరకు మెగా సూర్య ప్రొడక్షన్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే ఈ రోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైందని, పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని మేక...
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా పేరుపొందిన అనిరుధ్, ఇటీవల విజయవంతమైన సినిమాలు అయిన ‘విక్రం’, ‘జైలర్’, ‘బీస్ట్’ వంటి చిత్రాల ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆయన సంగీతం ప్రస్తుతం తెలుగు మరియు తమిళ చలన చిత్ర పరిశ్రమలో ట్రేండింగ్ లో ఉన్నది. అనిరుధ్ ఎప్పుడూ తన కొత్త సినిమాల గురించి ఒక లైన్ పోస్టు చేయడం ద్వారా అభిమానులకు ఉత్సాహాన్ని పంచుతారు. గత రాత్రి, ఆయన తన X ఖాతాలో ‘దేవర’...
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు దేవర ప్రమోషన్స్‌కు సంబంధించి ప్రెస్‌మీట్ కానీ, ఈవెంట్ కానీ జరగలేదు. ఆదివారం జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఇవాళ ఉదయం NTR అమెరికాకు వెళ్లిపోయారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్ 2024’లో దేవర మొదటి షో ప్రదర్శనను వీక్షించనున్నారు. దీంతో దేవర ప్రమోషన్స్ లేనట్టే అని అభిమానులు ఆవేద...
అమెరికా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో భారతీయ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఓ సాంగ్‌తో ఆడియన్స్‌ను అలరించారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోదీ DSPని కౌగిలించుకొని అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోట...
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఆ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించారు. అచ్చతెలుగులో మాట్లాడుతూ.. ఓ వీడియోను విడుదల చేశారు. తనను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాలనుకున్న మాటలను.. వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుంచారు.
కల్కి సినిమాపై ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. ‘భారతంలో ఉన్నది వేరు.. సినిమాలో చూపించింది వేరు. భారతంలో కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు. అశ్వత్థామను కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు’ అని వివరించారు. కాగా, గతంలో పుష్ప సినిమాపై కూడా గరికపాటి ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
➢GEMINI: అడవి రాముడు (8:30AM), నరసింహుడు (3PM)➢Star GOLD: రంగం (8AM)➢ZEE తెలుగు: ప్రేమించుకుందాం రా (9AM), వాసుకి (3PM)➢Star మా movies: ఆవిడా మా ఆవిడే (9AM), అదిరింది (3PM), కాంతారా (6PM) ➢ZEE సినిమాలు: ఏనుగు (7AM), ఒంటరి (9AM), గణేశ్ (3PM), రంగ్ దే (6PM)➢GEMINI MOVIES: మదర్ ఇండియా (7AM), ఆరు (1PM)
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘ఈవెంట్ రద్దు చాలా బాధాకరం. అవకాశం దొరికనప్పుడు ఫ్యాన్స్‌తో సమయం గడపాలనుకుంటా. దేవర సినిమా గురించి మేం పడ్డ కష్టం చెబుదామనుకున్నా. నిర్మాతలు, ఈవెంట్ నిర్వాహకులను తప్పుపట్టొద్దు. ఫ్యాన్స్ కంటే నేను ఎక్కువగా బాధపడుతున్నా. అభిమానుల ప్రేమకు జన్మ జన్మలు రుణపడి ఉంటా’ అని పేర్కొన్నారు.
‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయ్యింది. పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు నిలువరించినా ఫలితం లేకపోయింది. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత HYDలోని నోవాటెల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే పాసులు ఉన్నవారు, లేనివారు కూడా నోవాటెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో ఈవెంట్ జరపడం కష్ట...
తాను హక్కులు పొందిన ఓ ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా కొన్ని సినిమాల్లో వినియోగించారని ప్రముఖ దర్శకుడు శంకర్ ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. “వెంకటేశన్ రాసిన తమిళ నవల ‘నవయుగ నాయగన్ వేళ్ పారి’ కాపీరైట్స్ నావే. కానీ, అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో వినియోగించడం చూసి షాకయ్యా. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీరైట్‌ను ఉల్లంఘించకండి. లేదంటే న్యాయపరమైన ...