Jr.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆస్కార్ కోసం మార్చి 6న అమెరికా వెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 12న ఆస్కార్ ఈవెంట్ ఉంది. ఆ తర్వాతే తారక్ ఇండియాకి తిరిగి రానున్నాడు. వచ్చి రాగానే ఎన్టీఆర్ 30ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆస్కార్ కోసం మార్చి 6న అమెరికా వెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 12న ఆస్కార్ ఈవెంట్ ఉంది. ఆ తర్వాతే తారక్ ఇండియాకి తిరిగి రానున్నాడు. వచ్చి రాగానే ఎన్టీఆర్ 30ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. వాస్తవానికి ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ ప్రాజెక్ట్ లాంచింగ్.. తారక రత్న మరణంతో వాయిదా పడింది. అందుకే మార్చి థర్డ్ వీక్‌లో లాంచ్ చేసి.. ఏప్రిల్‌లో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఎన్టీఆర్ ఆస్కార్ నుంచి తిరిగి వచ్చే వరకు.. కొరటాల నుంచి ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చు. కానీ మరో రెండు రోజుల్లో ఓ గుడ్ న్యూస్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మార్చి 6న దీనిపై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అదేంటి.. ఆ రోజు ఎన్టీఆర్ అమెరికాకి వెళ్తున్నాడు కదా.. మరి అప్డేట్ ఎలా అనుకుంటున్నారా..! అయితే ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. మార్చి 6వ తేదీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ 30లో జాన్వీని కన్ఫామ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫోటో షూట్ కూడా అయిపోయిందని అంటున్నారు. కాబట్టి ఎన్టీఆర్ 30 నుంచి జాన్వీ లుక్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే నిజమైతే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరటనిచ్చినట్టే. ఇక జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. ఎన్టీఆర్ 30 పై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో 31వ సినిమా చేయబోతున్నాడు యంగ్ టైగర్.