నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్యన కొట్లాట కొత్తేం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. హీరోలంతా కలిసే ఉంటున్నారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకుంటున్నారు. మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా ఫ్యాన్స్ మధ్య పోరు మాత్రం తగ్గడం లేదు. హీరోలు కూడా వాళ్లను గట్టిగా వారించడం లేదు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చిరు, బాలయ్య అభిమానులు బద్ద శత్రువుల్లా మారిపోయారు. డల్లాస్లోని అక్కడి తెలుగు ప్రజలు కొందరు ‘తగ్గేదేలే’ పేరుతో ఓ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఈ వేడుకలో మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్కు వచ్చిన వారిలో టిడిపి, జనసేన అభిమానులు.. తమకు నచ్చిన పాటలు కావాలని మొండి పట్టు పట్టారు. దాంతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. జై బాలయ్య, జై పవన్ అనే నినాదంతో ఈవెంట్ మార్మోగిపోయింది. అలాగే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పోస్టర్లతో నానా రచ్చ చేశారు. అయితే ఈ గొడవలో కేసీ చేకూరి అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చివరికి ఈ వివాదం ముదిరి అరెస్టుల వరకు వెళ్లింది. కేసీ చేకూరి రికార్డు చూసి అతన్ని జైలుకు తరలించారు. దాంతో ఈ గొడవ మరింత ముదిరింది. ప్రస్తుతం వీళ్లు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండు వర్గాల మధ్య ఘర్షణలో పలువురికి గాయాలు కూడా అయినట్టు సమాచారం. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికా గొడవతో తెలుగు రాష్ట్రాల్లోను ఫ్యాన్స్ రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే నువ్వా నేనా అంటున్నారు. మరి ఈసారి చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఇంకెంత గోల చేస్తారో చూడాలి.