AP: తిరుమలలో ఏర్పడిన దోషాలు తొలగించేందుకు చేపట్టిన శాంతిహోమం ప్రారంభమైంది. ఇవాళ 6 గంటలకు హోమం ప్రారంభమైంది. బంగారుబావి వద్ద యాగశాలలో శాంతిహోమం, పంచగవ్వ ప్రోక్షణ నిర్వహిస్తున్నారు. గోవుపాలు, గోమూత్రం, నెయ్యి, పెరుగు, పేడతో ఆరాధన చేస్తున్నారు. దీంతో ఆలయం శుద్ధి అవుతుందని ఆగమ సలహామండలి నిర్ణయించింది. కాగా, లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని CM CBN తెలిపారు.