తిరుపతి లడ్డూ నాణ్యతపై వివాదం కొనసాగుతున్న వేల అన్నవరం ప్రసాదంలో వినియోగించే నెయ్యిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికి లక్ష కేజీలకుపైగా నెయ్యి అవసరమయ్యే అన్నవరం దేవస్థానానికి ఏలూరు రైతు డైరీ నుంచి కిలో నెయ్యి రూ.538లకు సరాఫరా చేస్తున్నారు. అదే డైరీ విశాఖలోని సింహాచలం దేవస్థానానికి కిలో నెయ్యి రూ.385లకు అందిస్తోంది. ఒకే కంపెనీ రెండు దేవాలయాలకు వేర్వేరు ధరలకు సరాఫరా చేస్తుండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.