Rangam in Bonal.. These are the things that will happen in 2023 in fortune telling...
సికింద్రాబాద్ లష్కర్ బోనా(Lashkar Bonal)ల్లో సోమవారం కీలక ఘట్టమైన రంగంమెక్కడం, భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత 2023 భవిష్యవాణిని వినిపించారు. ఈ సంవత్సరం ప్రజలకు మంచే జరుగుతుంది అని చెప్పారు. కాస్త ఆలస్యం అయినా వర్షాలు సమృద్దిగా కురుస్తాయని వెల్లడించారు. అయితే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని స్వర్ణలత రంగంలో చెప్పారు.
రంగంలో భవిష్యవాణి వినిపిస్తూ.. మీరు చేసిన పూజలతో నన్ను సంతోషపరిచారు. నాకు ఏ లాంటి లోపం లేకుండా పూజలు చేశారు అని చెప్పారు. నా వద్దకు వచ్చిన వారిని చల్లగా చూసుకునే బాధ్యత నాది అని ఐదువారాల పాటు నాకు నైవేద్యాలతో నిత్యపూజలు చేయాలి. 5 వారాల పాటు నాకు సాక పోయండి అని తెలిపింది. గత ఏడాది నాకు ఇచ్చిన మాటను ఎందుకు మరిచిపోయారు అని కోపం తెచ్చుకుంది. తరువాత శాంతపడింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు.
ఆదివారం మహంకాళి బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది. సీఎం కేసీఆర్ తో పాటు వివిధ మంత్రులు, ఎమ్యెల్యేలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలకు అన్ని శాఖలు సహకరించాయని, వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి పోతరాజుల ఊరేగింపు, ఘటోత్సవం ఘనంగా జరుగుతుందన్నారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు.