శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కు అవసరమైన వైద్య పరికరాలు కొనుగోనులు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ దాతృత్వం ప్రకటించింది. రూ.22 కోట్లు విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరుకు టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్ ,స్విమ్స్ అధికారుల మధ్యలో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, స్విమ్స్ లో రోగులకు వైద్య సహాయం అందించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్) ఈ నిధులను అందిస్తున్నా మన్నారు. ఈవో ధర్మారెడ్డి టీటీడీ తిరుమలలో భక్తులకు, స్విమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలను ఆయనకు వివరించారు.