»Lord Venkateswara August Tirumala Tirupati 120 Crore Income In One Month
Tirupati: సినిమా కలెక్షన్లను బీట్ చేసిన తిరుమల ఆదాయం
ఏపీలోని తిరుమల తిరుపతికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే రూ.1కోటి 9లక్షల విలువైన లడ్డూ ప్రసాదాలను విక్రయించారు. అయితే ఆ భక్తుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం ఎంతో తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు.
Lord Venkateswara August Tirumala Tirupati 120 crore Income in one month
Tirupati: ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి(Tirumala Tirupati ) శ్రీవేంకటేశ్వరస్వామి(Lord Venkateswara)ని నిత్యం దర్శించుకునే వారు అనేక మంది ఉంటారు. అయితే గత నెలలో స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమోగుతున్నాయి. మరోవైపు శ్రీవారి ఆదాయం(Income) కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. గత నెల ఏకంగా ఆగస్ట్‌లో మొత్తం 22.25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెలలో శ్రీవారి హుండీకి రూ.120.05 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే ఈ మాసంలో కోటి 9 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించినట్లు టెంపుల్ అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించబోతున్నారు. అధికమాసం సందర్భంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే శ్రీవారికి భక్తుల రద్ధీ పెరగడం ఆనందాన్ని ఇస్తున్నా వారి భద్రతకు తగిన చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. స్వామి వారిని దర్శించుకునే ప్రజల మనసు భక్తితో ఉండాలి కానీ భయంతో కాదు. అయితే ఇప్పటికే 3 చిరుతలను బంధించినా మరిన్ని చిరతలు సంచరిస్తుండడం అందరిలో కలవరం రేపుతుంది. దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటే భక్తులతో సహా స్వామివారికి ముడుపులు కూడా భారీగానే వచ్చే అవకాశం ఉంది.