Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 29th)..కోపాన్ని తగ్గించుకోవాలి.
ఈ రోజు(2024 April 29th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
వీలైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నించండి. మీమీ రంగాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో కొత్త పనులు ప్రారంభిస్తారు.
వృషభం
విందులు, వినోదాలు అంతగా కలిసిరావు. అనుకోకుండా ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మిథునం
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.
కర్కాటకం
కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
సింహం
మనోధైర్యంతో ముందుకు సాగాలి. కొత్తగా మొదలుపెట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకోవాలి. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులు వస్తాయి. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
కన్య
కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకోని ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు వస్తుంది. మిమ్మల్ని ఇతరులు ఆదర్శంగా తీసుకోంటారు.
తుల
చంచలం మనస్థత్వం వలన ఇబ్బందులు ఉంటాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలు ఉంటాయి. అనుకోని కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండండి.
వృశ్చికం
ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని పొందుతారు. శత్రువుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉన్నాయి.
ధనుస్సు
కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా పడాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్తపనులు వాయిదావేసుకోవాల్సి వస్తుంది.
మకరం
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. మానసిక ఆందోళన ఉంటుంది. అనారోగ్య బాధలు ఏర్పడుతాయి. కొన్ని కారణాల వలన అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త పనులకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం
కోరుకునేది జరగదు. మరోకటి జరుగుతుంది. అనారోగ్య బాధలు ఉన్నాయి. సమయానికి భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. మనుస్సు చంచలంగా ఉంటుంది. మనోనిగ్రహానికి ప్రయత్నం చేయాలి. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.
మీనం
మీరు చేసే పనులను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. మొదలు పెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కళలందు ఆసక్తి ఏర్పడుతుంది. కొత్త వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.