చాలా మంది ఆలయానికి వెళ్లి గుడి ప్రదక్షిణ చేస్తుంటారు. కొంత మంది ఆలయ ఆవరణలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటివల్ల వారికి కొన్ని రకాల సమస్యలు వాటిల్లుతుంటాయి. ఆలయ ఆవరణలో కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల పుణ్యం దక్కకపోవడమే కాకుండా చెడు ప్రభావాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆలయ ఆవరణలో చేయకూడదని పనులు చేస్తే అరిష్టం కలగడంతో పాటుగా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కాబట్టి ఆలయానికి వెళ్తే కొన్నిరకాల తప్పులు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయాలకు వెళ్లే ఆడవారు ఎప్పుడూ జడ వేసుకుని వెళ్లడం మంచిది.
పురుషులు అయితే శుభ్రంగా తల దువ్వుకుని, తిలకం దిద్దుకుని వెళితే బావుంటుంది.
ఆడవారు జుట్టు విరబోసుకోని ఆలయానికి అస్సలు వెళ్లరాదు.
ఆలయానికి వెళ్లిన తర్వాత తలపై ధరించిన వస్త్రాన్ని తొలగించి దైవారాధన చేయాలి.
దేవాలయాలనికి చాలా మంది చెప్పులు వేసుకుని వెళ్తారు. అయితే ఆలయానికి బయటే చెప్పులు వదిలి కాళ్లు శుభ్రంగా కడిగిన తర్వాతే ప్రవేశించాలి.
ఆలయంలోకి వెళ్లిన తర్వాత మొదట క్షేత్ర పాలకుడికి నమస్కారం చేయాలి.
ఆలయంలో దేవునికి తప్పా ఇతరులకు నమస్కారం చేయరాదు. పూజారికి కూడా నమస్కారం చేయకూడదు.
పూజారి నుంచి మనం స్వీకరించిన ప్రసాదాన్ని ఆలయ పరిసరాలలో లేదా బయట ఎక్కడైనా ఎట్టిపరిస్థితుల్లోనూ కింద పడేయకూడదు.
పూజ ముగిసిన తర్వాత ఆలయంలో కొద్ది సమయం దేవుడికి వీపు చూపించకుండా కూర్చున్నట్లైతే మంచి ఫలితం ఉంటుంది.