ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. లక్నో- కాన్పూర్ హైవేపై వెళ్తున్న ఓ ట్రక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీకొంది. అంతేకాకుండా రోడ్డు పక్కనున్నవారిపై కూడా ట్రక్కు దూసుకెళ్లింది.
ఆ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం తర్వాత స్థానిక గ్రామస్తులు హైవేను దిగ్భంధించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఉన్నావ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.