BPT: కర్లపాలెంలో ఒక కూల్ డ్రింక్స్ షాపులో దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 30న ఎన్.హెచ్.216 పక్కన ఉన్న శ్రీనివాస కూల్ డ్రింక్స్ షాపులో గుర్తుతెలియని వ్యక్తి డబ్బులు దొంగిలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం కర్లపాలెం ఐలాండ్ సెంటర్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ELR: గణపవరం మండలం ఎస్. కొండేపాడు గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ అధికారి అడబాల కనక దుర్గా ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో (50) మృతి చెందారు. పిప్పర వద్ద శుక్రవారం బైక్‌పై వెళ్తున్న దుర్గా ప్రసాద్‌ను లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఆయన మృతి చెందారు. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
MDCL: సంతానం లేదని మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్‌కు వలస వచ్చిన రవళి అనే మహిళ, పెళ్లై మూడేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైంది. తన భర్త వినయ్‌కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పింది. వినయ్ ఇంటికి చేరుకునేసరికి ఆమె ఉరివేసుకొని మృతి చెందింది.
ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో శుక్రవారం భూ తగాదా విషయంలో మాట మాట పెరిగి అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో వీధి కుక్కలు స్వైరవిహారం ఎక్కువైంది. వాటిని జనావాసాలకు దూరంగా తరలించకపోవడంతో నిత్యం పలువురిపై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాంనగర్, వెశాలపల్లిలో పలువురిపై వీధి కుక్క దాడులు చేయగా.. ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
W.G: భీమవరం-ఉండి రోడ్డులోని శ్రీవారి ఆలయం వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా, నర్సాపూర్ ట్రైన్ ఢీకొని గుర్తు తెలియని మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే గార్డ్ గుర్తించి ఆమెను ఉండి రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో భీమవరం ఆసుపత్రికి తరలించగా, తలకు తీవ్ర గాయాలవడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ATP: బెలుగుప్ప మండలం నక్కనపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెలుగుప్పకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
AP: యూపీ నోయిడాలోని బిమ్‌టెక్ కాలేజ్ హాస్టల్లో జరిగిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన దీపక్ మృతిచెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు దేవాన్ష్ తండ్రి మాజీ పోలీస్ అధికారి కాగా.. తన తండ్రి లైసెన్స్డ్ తుపాకీతో అతనే దీపక్‌ని కాల్చి, తననూ కాల్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో బుల్లెట్స్ గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
TG: ఆస్తికోసం ఓ కసాయి కూతురు కన్నతల్లినే కడతేర్చింది. జనగామ జిల్లా పెద్దతండాకు చెందిన లక్ష్మీ తన కూతురు సంగీతకు 5ఏళ్ల క్రితం వీరయ్యతో పెళ్లి చేసింది. కట్నంగా తనకున్న భూమిలో కొంత అమ్మి బంగారం చేయించి ఇచ్చింది. అయితే మిగిలిన భూమి కూడా కావాలంటూ తల్లిని సంగీత పలుమార్లు వేధించింది. ఫలితం లేకపోవడంతో సంగీత తన భర్తతో కలిసి.. తల్లి నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి చంపేసింది.
E.L.R; ఏలూరులో గురువారం విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన తమ్ముడు కోటి మాధవరావును చివరిసారిగా చూసేందుకు కాకినాడ నుంచి వచ్చిన అన్నయ్య కోట సూర్యనారాయణ రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అన్నదమ్ములిద్దరూ దుర్మరణం చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KMR: జుక్కల్ మండలం డోన్గావ్ గ్రామపంచాయతీ పరిధిలోని శక్తి నగర్లో పేకాట ఆడుతున్న 11మందిని గురువారం అరెస్టు చేసినట్లు జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా పేకాట ఆడుతూ 11 మంది పట్టు పడ్డారని అన్నారు. వారి వద్ద నుంచి రూ. 3,130 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు జప్తు చేశామని తెలిపారు.
తమిళనాడు కళ్లకురిచిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. ప్రియుడితో ఇంట్లో దొరికిన తన భార్యను నరికి చంపేశాడు. అనంతరం ఆమె ప్రియుడి తల నరికి పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి మేడపై ఇద్దరి మొండాలు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
TG: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతన్ని ఢిల్లీకి తరలించారు. ఝార్ఖండ్ రాంచీలో బాంబు దాడులకు కుట్ర పన్నిన డానిష్ అనే ఉగ్రవాది విచారణలో ఈ యువకుడి పేరు వెలుగులోకి వచ్చింది. కాగా, వారిద్దరూ ప్రత్యేక వీడియో కాలింగ్ యాప్‌లో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై దాడుల కుట్రకు సంబంధించి పాక్ దౌత్యవేత్త ఆమిర్ జుబేర్ సిద్ధిఖీకి NIA కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 15న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. హాజరుకాని పక్షంలో సిద్ధిఖీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించి, ఆయన ఆస్తులను జప్తు చేస్తామని NIA హెచ్చరించింది. కాగా, ప్రస్తుతం సిద్దిఖీ పాకిస్థాన్‌లో ఉన్నారు.