జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఓ వ్యక్తి 28 ఏళ్ల క్రితం బస్సు నడుపుతుండగా గేదెను ఢీకొన్నాడు. అప్పట్లో గేదె మరణించిన విషయంలో అతనిపై కేసు నమోదైంది. ఆ వ్యక్తికి ఇప్పుడు 83 ఏళ్లు. పోలీసులు ఇప్పుడు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
డాక్టరై జనం నాడీ పట్టుకోవాల్సిన శృతి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కింది. మసాజ్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యభిచారం చేయించింది. ఫస్ట్ టైమ్ అరెస్టై జైలుకు వెళ్లొచ్చిన ఆమెలో మార్పు రాలేదు. తాజాగా మరొసారి పట్టుబడింది.
తమిళ హీరో దళపతి విజయ్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. ఇటీవలె ఆయన సినిమా లియో నుంచి వచ్చిన నా రెడీ అనే లిరికల్ సాంగ్‌లో ఎక్కువగా సిగరెట్లు తాగుతూ కనిపించాడు. దీంతో ఆయన మద్యం, పొగాకు ప్రోత్సహించినందుకు విజయ్ పై ఓ వ్యక్తి కేసు పెట్టాడు.
కర్నాటక జిల్లాలో ఇప్పటి వరకు విననటువండి సంచలన ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి తన స్నేహితుడి గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా గొంతు కోసి రక్తం కూడా తాగేశాడు.
ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు పల్టీ కొట్టింది. అయితే ఆటోను తప్పించబోయి బల్తా పడినట్లు తెలుస్తోంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 70 మందిలో 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రముఖ పశుపతినాథ్ ఆలయం(pashupatinath temple)లో 10 కిలోల బంగారం మాయమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అసలు ఏలా పోయిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.