న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రాత్రి 8 గంటల నుంచే తనిఖీలు నిర్వహించి భారీగా కేసులు నమోదు చేశారు.
ఈ రోజు తెల్లవారుజామున మహారాష్ట్రలోని ఓ గ్లవ్స్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అక్కడే నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని హాల్వి గ్రామానికి చెందిన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను బకెట్ నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల వల్ల గత 24 గంటల్లో 200 మంది హమాస్ ప్రజలు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో పంజాబ్‌కు చెందిన మోడల్‌పై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. మహిళా మోడల్ పంజాబ్‌లోని జలంధర్ నివాసి. షూటింగ్ కోసం డిసెంబర్ 22న తాను సిమ్లాకు వచ్చానని మోడల్ చెబుతోంది.
పుదుక్కోట్టై జిల్లాలో సిమెంట్ బస్తాలతో వెళ్తున్న ట్రక్కు టీ దుకాణంతోపాటు పక్కనే ఆగి ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు.
భారత సంతతికి చెందిని ఓ సంపన్న కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తన భార్య పుట్టింటికి వెళ్లి రావట్లేదని ప్రశాంత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అసలు విషయం బయటపడింది. తన భార్య స్నేహకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అప్పుల బాధ తాళ్లలేక అనకాపల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబంలో అందరూ మరణించగా ఓ చిన్నారి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది.
దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ బాంబు బెదిరింపులు దేశ రాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలకు వచ్చాయి.
హైదరాబాద్ పోలీసులు మరో భారీ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తెస్తున్న ముగ్గురు నేరగాళ్లను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
చలి తీవ్రతను భరించలేక ఒక వ్యక్తి ఇంట్లో కుంపటి మట్టించి అక్కడే నిద్రపోయాడు. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని చనిపోయాడు.
ప్రజాభవన్ బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో నింధుతుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్‌కి పారిపోయినట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు దాడి తీవ్ర కలకలం రేపింది. సీసీ కెమెరా ఆధారంగా ఇద్దరు అనుమానితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ దేశాన్ని గుర్తించేలా ఏది ఒంటిపై ప్రదర్శించొద్దని జాతీయ భద్రతా మండలి స్పందించింది.
అమెరికాలోని టెక్సాస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తెలుగువాళ్లు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వాసులు. ప్రమాద వార్త తెలియడంతో స్థానికుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.