బాడీ బిల్డింగ్ కోసం అవసరమైన జింక్ శరీరానికి పొందాలనే ఉద్దేశంతో ఓ పేషెంట్ నాణాలు, మ్యాగ్నెట్లు తిన్నాడు. కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు.
ముంబాయిలో మరాఠా కోటా ఉద్యమం ప్రస్తుతం హింసాత్మకంగా మారుతోంది. జల్నాలోని ఆందోళనకారులు ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. శాంతిభద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల సమీపంలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
మాఘ పౌర్ణమి సందర్భంగా గంగా నదిలో స్నానం చేసేందుకు హరిద్వార్‌కు వెళుతున్న ప్రయాణికుల ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెరువులో పడిపోయింఇ. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు.
ఓ టీవీ ఛానెల్ యాంకర్ ను త్రిష అనే యువతి కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. యాంకర్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్న త్రిష కిడ్నాప్ చేయించిందని అంటున్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు వరుసగా ప్రమాదాలు జరిగాయని చివరికి ఈ ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోవల్సి వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.
భారీ రవాణా నౌక చైనాలో ఓ వంతెనను ఢీకొంది. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఈరోజు ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. వంతెనను నౌక బలంగా ఢీకొనడంతో రెండు ముక్కలైంది.
యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ జశ్వంత్ గంజాయితో పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో పోలీసులు అతని అన్నను పట్టుకోవటం కోసం వెళితే.. ఊహించని విధంగా షణ్ముక్ గంజాయితో దొరికాడు.
ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రసవానికి ప్రయత్నించిన ఓ మహిళ తన ప్రాణాలతో పాటు బిడ్డ ప్రాణాలు కూడా పోగొట్టుకుంది. ఈ విషాదకర ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది.
కరీంనగర్‌లోని ఓ వీధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5 గ్యాస్ సిలిండర్లు పేలాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.