VZM: ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు గ్రామమైన పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం పాచిపెంట ఎస్సై సురేష్ గంజాయి పట్టుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్ ఒడిస్సా నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీలు చేశారు. వారి వద్ద నుంచి కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళంకు చెందిన ఆవల అనిల్, తన స్నేహితుడు భరత్గా గుర్తించి, వారిపై కేసు నమోదు చేశారు.
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లాలోని 16వ నెంబర్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. దాదాపు 23 మందికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ నుంచి కొంత మంది భక్తులతో బస్సు.. పూరీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలెనా బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడాతో పాటు జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా ప్రాంతాల్లో ఇది పెను ప్రభావం చూపించింది. ఆయా ప్రాంతాల్లో 44 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో రోడ్లు, ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లోకి నీరు చేరింది. ఘటనాస్థలాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీని కారణంగా 15-26 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధిక...
భారీ పేలుడు సంభవించి ఇళ్లు ధ్వంసమైన ఘటన తమిళనాడులో జరిగింది. విరుదునగర్ జిల్లా సాతూర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించటంతో ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది, రెస్య్కూ టీమ్ ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు.
WG: మానసిక దివ్యాంగ బాలికపై కారు డ్రైవర్ వేధింపులకు పాల్పడిన ఘటన ప.గో జిల్లా కాళ్ల మండలంలో జరిగింది. 5వ తరగతి చదువుతున్న బాలికను ఏలూరుకు చెందిన కృపారావు ఈనెల 19న కారులో తీసుకెళ్లి వేధించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికెళ్లాక ఆ బాలిక తల్లిదండ్రులు చెప్పడంతో వారు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కృపారావును శుక్రవారం అరెస్ట్ చేశామని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
జనగాం: పాలకుర్తి మండలంలో డీసీఎం బోల్తా పడి ఆవులు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారులో అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాను శనివారం తెల్లవారుజామున అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో తరలిస్తున్న సుమారు 100 గోవులు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను చౌటుప్పల్ ఆసుపత్రికి, గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించారు.
MDK: కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న AR కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా కలెక్టరేట్‌లో డ్యూటీ చేస్తున్నాడు. రాత్రి తుపాకీతో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు.
VZM: ఇంస్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో యువతి ఫోటోలు పెట్టి వేధిస్తున్న విజయనగరానికి చెందిన యువకుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరులో అరెస్టు చేసి విశాఖ తీసుకువచ్చారు. విశాఖకు చెందిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువకుడు పరిచయం అయ్యాడు. యువకుడితో కొద్ది రోజులు పాటు చాటింగ్ చేసి తర్వాత కలిసి తీసుకున్న ఫోటోలు ఇన్‌స్టా ద్వారా అందరికీ పంపించాడు.
VZM: బొబ్బిలి మండలంలోని కొత్తపెంటలో విద్యుత్ షాక్తో రెండు ఎద్దులు మృతి చెందాయి. కొత్తపెంట చెరువులో తెగి పడి ఉన్న వైర్లు తాకడంతో రైతు బేతనాపల్లి తిరుపతికి చెందిన రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదంలో రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విద్యుత్ ప్రమాదంలో ఎద్దులు మరణించిన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో హెలీన్ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో తుపాను విరుచుకుపడింది. తుపాను కారణంగా ఆగ్నేయ అమెరికా అంతటా అపార ఆస్తి నష్టం కలిగింది. వందల మందిని పడవల సాయంతో విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. ఉత్తర కరోలినాలో వరదలు పోటెత్తడంతో.. కార్లు కొట్టుకుపోయాయి.
VSP: పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మధురవాడ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఎస్సై భాస్కర్ సిబ్బందితో వెళ్లి నిఘా పెట్టినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హనుమంతు జగదీష్ స్థానిక వుడా కాలనీకి చెందిన ఐ శ్రీకాంత్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఏలూరు: ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం పేకాట శిబిరంపై ఎస్సై సుధీర్ బాబు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.15,120 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్సై మాట్లాడుతూ..పేకాట, కోడి పందేలు నిర్వహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు.
TG: సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కొడుకు వైష్ణవ్ ర్యాగింగ్‌కి గురయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో వైష్ణవ్ ఎంబీఏ చదువుతున్నాడు. అదే కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థి శ్యామ్, వైష్ణవ్‌తో బస్‌లో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే శ్యామ్ ఆవేశంలో వైష్ణవ్ చెవిని కొరికేశాడు. దీంతో ఆర్పీ పట్నాయక్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ప్రకాశం: ప్రమాదంలో గాయపడి కోలుకుంటూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన కంభం మండలం దేవనగరంలో జరిగింది. గ్రామానికి చెందిన అశోక్ 15 రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అశోక్ శుక్రవారం గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించి వైద్యులు మృతి చెండాడాని నిర్ధారించారు....