జార్ఖండ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ధన్బాద్లోని పురానా బజర్ లోని ఓ హాస్పిటల్ లో జరిగిన ఈ ప్రమాదంలో డాక్టర్ దంపతులతో సహా ఆరుగురు మృతి చెందారు. శుక్రవారం రాత్రి హజ్రా హాస్పిటల్లో జరిగిన ప్రమాదంలో మరొకొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు డాక్టర్ వికాస్ హజ్రా, అతని భార్య ప్రేమ హజ్రాతో పాటు మరికొందరు ఉద్యోగులు మరణించారు. మంటలు చెలరేగాక ఆర్పేయత్నం జరగకపోవటం..దట్టమైన పొగ అలుముకోవటంతో అందరూ ఊపిరి ఆడక మరణించినట్లుగా గుర్తించారు. హాస్పిటల్ మొదటి అంతస్థులోని స్టోర్ రూమ్లో చెలరేగిన మంటలు క్రమంగా ఆస్పత్రి మొత్తం వ్యాపించాయి. ఈ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండడంతో జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. రోగులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు కానీ దాదాపు తొమ్మిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.