• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం

ASF: కాగజ్ నగర్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కాల్చడంతో అందులోంచి వచ్చిన మినుగురులు వరుడి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన టెంటుపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని టెంటు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

SDPT: కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గడ్డం కృష్ణయ్య, ఎంపీవో రవీందర్ రెడ్డి మండలంలోని వార్డు సభ్యులకు శిక్షణ సదస్సు నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. అధికారులు బాలాజీ, కుమార్, మాధవి అందించగా.. శిక్షణ పూర్తి చేసిన వార్డ్ సభ్యులకు గ్రామ కార్యదర్శి మాధురి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను అందజేసి అభినందించారు.

February 22, 2026 / 07:51 AM IST

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డైరెక్టర్ జగన్మోహన్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆదివారం లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.

February 22, 2026 / 07:50 AM IST

గల్ఫ్ కార్మికులకు ఆసరా.. హెల్ప్ లైన్ నంబర్ విడుదల..!

NRML: గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న జిల్లా కార్మికుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుకలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. విదేశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు 93984 21883 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు.

February 22, 2026 / 07:49 AM IST

ఆ ప్రమాదం జరిగి నేటికి ఏడాది..!

NLG: జిల్లా ప్రజలకు సాగు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు పనులు అవాంతరాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి నేటికీ ఏడాది అయ్యింది. ఈ ప్రాజెక్టు 20 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. 43 కిలోమీటర్ల సొరంగ మార్గానికి గాను ఇంకా 9 కి.మీ పనులు జరగాల్సి ఉంది.

February 22, 2026 / 07:47 AM IST

మాతృభాషపై అభిమానం చాటుకున్న విద్యార్థులు

JGL: మల్లాపూర్ మండలం మొగిలిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘అ’ ఆకారంలో కూర్చొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరు మాతృభాషకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి నేర్చుకోవాలని, మాతృభాష అమ్మ లాంటిదని విద్యార్థులు నినదించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వేముల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:46 AM IST

నకిలీ పురుగు మందు.. రూ.8 లక్షల స్టాక్ సీజ్..!

SRPT: మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామంలో భారీగా నకిలీ పురుగుమందు విక్రయం బట్టబయలైంది. ప్రముఖ కంపెనీ ‘Bayer Nativo’ పేరుతో నకిలీ మందులు అమ్ముతున్నారన్న సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు డీలర్ షాపులు, గౌడౌన్‌లపై శనివారం సాయంత్రం మెరుపు దాడులు చేశారు. రూ.3 లక్షల విలువైన నకిలీ ప్యాకెట్లు, పౌడర్‌తో పాటు రూ.8 లక్షల విలువైన పెస్టిసైడ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.

February 22, 2026 / 07:45 AM IST

లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

SRPT: మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల గోడపత్రికను కాంగ్రెస్ పార్టీ మునగాల మండల అధ్యక్షుడు జయపాల్ రెడ్డి మునగాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.

February 22, 2026 / 07:43 AM IST

కత్తితో పొడిచి చంపారు.. తల్లీకొడుకుల అరెస్ట్

SDPT: దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు మృతుడు వంగ బాల్రెడ్డి (61)ని శుక్రవారం కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీఐ రాజేశ్ తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ వివాదంపై పాత విభేదాలు కొనసాగుతుండగా, వంగ రేణుక (55), ఆమె కుమారుడు సోమేశ్వర్ (26) కలిసి బాల్ రెడ్డిని హత్య చేశారని తెలిపారు.

February 22, 2026 / 07:42 AM IST

గ్రామం నుంచి ALL INDIA పోటీలకు

SDPT: రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి.సతీశ్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్‌బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్య ప్రదేశ్‌లో జరగనున్నాయి.

February 22, 2026 / 07:40 AM IST

జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

VKB: జిల్లాలో ఈరోజు చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 280-320 వరకు విక్రయిస్తుండగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.320కు పైగా ఉంది. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్లే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 22, 2026 / 07:34 AM IST

జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక: CP

NZB: జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక అని, అన్ని మతాల వారు సోదరభావంతో ఉండాలని CP సాయి చైతన్య కోరారు. రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రతీ ఒక్కరూ శాంతి యుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలో పోలీసులకు సహకరించాలని సూచించారు.

February 22, 2026 / 07:34 AM IST

‘దాడికి యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలి’

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా దర్యాప్తు చేయాలని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులపై దాడులు ఒక ఫ్యాషన్‌లా మారిపోవడం అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 07:31 AM IST

ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: PDSU

NRPT: ఈ నెల 25వ తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని PDSU నాయకుడు శ్రీహరి యాదవ్ కోరారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిచూసుకోవాలని, సెంటర్లలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎం ఉండాలని, పరీక్ష సమయానికి అనుకూలంగా RTC బస్సులను నడిపించాలని కోరారు.

February 22, 2026 / 07:30 AM IST

జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..?

సూర్యాపేట జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.200 నుంచి రూ. 250 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.260 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ.10–15 వరకు పెరిగింది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చుని స్థానికులు తెలుపారు.

February 22, 2026 / 07:29 AM IST